ఖమ్మంఆగష్టు 11
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నూతన కార్యవర్గంగా ఎన్నికైన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. మంగళవారం నూతన కార్యవర్గ సభ్యులు పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గంలో బి. హేమనాథ్ – అధ్యక్షుడు, కె. జగదీష్ – ఉపాధ్యక్షుడు, వి. సురేష్ – ఉపాధ్యక్షుడు, బి. వీరభద్రం – కార్యదర్శి, కె. సుధాకర్ – సంయుక్త కార్యదర్శి, బి. అప్పారావు – నిర్వహణ కార్యదర్శి, టి. నరసింహరావు – కోశాధికారిగా ఎన్నికయ్యారు.
ఈసీ సభ్యులుగా వై. వెంకటేశ్వర్లు, వి. హరికృష్ణ, కె. సురేష్, టి. జమలయ్య, ఎన్. ఎడుకొండలు, టి. రేణుక ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు పోలీసు సిబ్బంది సమస్యలు, సంక్షేమ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ సూచించారు. శాఖలో సమన్వయంతో పనిచేస్తూ సిబ్బంది సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ సాంబరాజు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్ పాల్గొన్నారు.

