ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 13 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 12: మనుబోలు పోలీసుల చొరవతో ఇద్దరు గిరిజన చిన్నారులు సురక్షితంగా తమ తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నారు. కాకినాడ జిల్లా ఇరగవరం మండలం వేలేటిపాడు గ్రామానికి చెందిన వెంకన్న, బుల్‌రెడ్డి అనే చిన్నారులు తమను బాతులు మేపే వారు కిడ్నాప్ చేశారంటూ అక్కడి నుంచి తప్పించుకుని కొమ్మలపూడికి చేరుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శివ రాకేష్ సిబ్బందితో కలిసి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఇరగవరం పోలీసులతో సంప్రదించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారులను సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు గిరిజన చిన్నారులు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 13 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 12: మనుబోలు పోలీసుల చొరవతో ఇద్దరు గిరిజన చిన్నారులు సురక్షితంగా తమ తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నారు. కాకినాడ జిల్లా ఇరగవరం మండలం వేలేటిపాడు గ్రామానికి చెందిన వెంకన్న, బుల్‌రెడ్డి అనే చిన్నారులు తమను బాతులు మేపే వారు కిడ్నాప్ చేశారంటూ అక్కడి నుంచి తప్పించుకుని కొమ్మలపూడికి చేరుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శివ రాకేష్ సిబ్బందితో కలిసి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఇరగవరం పోలీసులతో సంప్రదించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారులను సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

