Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

పొన్కల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొన్కల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • పంట చేతికి వచ్చి ధాన్యం విక్రయించుకునే సమయం వచ్చినప్పటికీ పొన్కల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • పొన్కల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు కొనుగోలు కేంద్రం కోసం ఎదురుచూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పొన్కల్ గ్రామంలో వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పంట చేతికి వచ్చి ధాన్యం విక్రయించుకునే సమయం వచ్చినప్పటికీ పొన్కల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొన్కల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు కొనుగోలు కేంద్రం కోసం ఎదురుచూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పొన్కల్ గ్రామంలో వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పంట పండించడానికి రేయింబవళ్లు కష్టపడే అన్నదాతలు, ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు పడాల్సి రావడం బాధాకరమని రైతులు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి పొన్కల్‌లో తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, రైతుల కష్టాలను గుర్తించి న్యాయం చేయాలని పొన్కల్ మరియు పరిసర గ్రామాల రైతులు కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *