పెగడపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెగడపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.


