Saturday, 3 October 2026
  • Home  
  • పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం
- వరంగల్

పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం

ఇంటర్నేషనల్ సింబయాసిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్&డైరెక్టర్ శ్రీ చిట్ట శ్యాంసుందర్ అమీనాబాద్, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, అమీన్‌బాద్‌లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డైరెక్టర్ & ప్రొఫెసర్ శ్రీ చిట్ట శ్యామ్ సుందర్ గారు విద్యార్థులకు వివిధ విద్యా, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఇతరులను అనుసరించకుండా తమ ఆసక్తి, బలాలు, సామర్థ్యం మరియు అభిరుచులను గుర్తించి, వాటికి అనుగుణంగా సరైన సబ్జెక్ట్ మరియు కోర్సును ఎంచుకోవాలని ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్ కెరీర్‌ను నిర్ణయించుకునే ముందు తనకు ఏ రంగంలో ఆసక్తి ఉందో, ఏ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యమని వివరించారు. అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒకే కోర్సుకు పరిమితం కాకుండా, NEP-2020లోని బహుళ విద్యా అవకాశాలకు అనుగుణంగా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కోర్సులను ఎంపిక చేసుకుని అదనపు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు ఇతర నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. 10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్‌లో సబ్జెక్టుల ఎంపిక, ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు, వివిధ కెరీర్ మార్గాలపై విద్యార్థులకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు తమ నిర్ణయాలను స్పష్టమైన అవగాహనతో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి, ఉపాధ్యాయులు మరియు 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు భవిష్యత్ విద్యా, కెరీర్ ఎంపికలపై స్పష్టత కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

ఇంటర్నేషనల్ సింబయాసిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్&డైరెక్టర్
శ్రీ చిట్ట శ్యాంసుందర్ అమీనాబాద్, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, అమీన్‌బాద్‌లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డైరెక్టర్ & ప్రొఫెసర్ శ్రీ చిట్ట శ్యామ్ సుందర్ గారు విద్యార్థులకు వివిధ విద్యా, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు ఇతరులను అనుసరించకుండా తమ ఆసక్తి, బలాలు, సామర్థ్యం మరియు అభిరుచులను గుర్తించి, వాటికి అనుగుణంగా సరైన సబ్జెక్ట్ మరియు కోర్సును ఎంచుకోవాలని ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్ కెరీర్‌ను నిర్ణయించుకునే ముందు తనకు ఏ రంగంలో ఆసక్తి ఉందో, ఏ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యమని వివరించారు.
అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒకే కోర్సుకు పరిమితం కాకుండా, NEP-2020లోని బహుళ విద్యా అవకాశాలకు అనుగుణంగా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కోర్సులను ఎంపిక చేసుకుని అదనపు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు ఇతర నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.
10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్‌లో సబ్జెక్టుల ఎంపిక, ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు, వివిధ కెరీర్ మార్గాలపై విద్యార్థులకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు తమ నిర్ణయాలను స్పష్టమైన అవగాహనతో తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి, ఉపాధ్యాయులు మరియు 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు భవిష్యత్ విద్యా, కెరీర్ ఎంపికలపై స్పష్టత కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.