Tuesday, 16 June 2026
  • Home  
  • పాతూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాతూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే

పాతూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా వింజమూరు మండలం పాతూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ స్వర్ణ, బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ప్రజల వివరాలను పరిశీలిస్తూ ఓటరు జాబితా సవరణ పనులను పర్యవేక్షించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిస్ కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫారం-7 ద్వారా తొలగింపులు, ఫారం-8 ద్వారా వివరాల సవరణ కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

పాతూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా వింజమూరు మండలం పాతూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ స్వర్ణ, బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ప్రజల వివరాలను పరిశీలిస్తూ ఓటరు జాబితా సవరణ పనులను పర్యవేక్షించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిస్ కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫారం-7 ద్వారా తొలగింపులు, ఫారం-8 ద్వారా వివరాల సవరణ కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.