అనంతసాగరం సెప్టెంబర్ 25,పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి పంచాయితీ పరిధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైనింది. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో మురుగు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. మరోవైపు దోమలు సై ్వర విహారం చేస్తుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీలో పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు..


