పాడేరు గురుకుల స్కూల్ కేంద్రంగా 3 నెలల రాణి లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, IAS ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో బండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ద్వారా జిల్లాలోని 166 స్కూళ్లలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి బాలిక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
బండి ఇన్స్టిట్యూట్ ఉత్తరాంధ్ర డైరెక్టర్ డి. చారి, జిల్లా APC డా. వి.ఏ. స్వామి నాయుడు, ఇంచార్జ్ బాకూరు పాండు రాజు ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతుంది. కార్యక్రమంలో DEO భానుమూర్తి రాజు, ప్రిన్సిపాల్ నీలిమ తదితరులు పాల్గొన్నారు.


