పశ్చిమ గోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 19న పెద్దఅమీరం గ్రామంలోని రాధాకృష్ణ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “అభివృద్ధి – సంక్షేమ విజయోత్సవం” కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానుండగా వేదిక, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ఫలితాలను ప్రజలకు చేరవేయడంలో అన్ని శాఖలు సక్రమ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విజయాలను ప్రజలకు వివరించడం లక్ష్యంగా ఉంది.
Video Link: https://bpknewsofficial.blogspot.com


