Thursday, 1 October 2026
  • Home  
  • పవన్ కీలక ప్రకటన

జిల్లా లో..520 కోట్లతో పల్లె పండుగ కార్యక్రమాల కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో 115 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి రూ.52 కోట్లతో ప్రత్యేక పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఉదయగిరి కోటకు వెళ్లే నాలుగు కిలోమీటర్ల రహదారిని రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఉదయగిరి కోటను పర్యాటక, ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.