వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సైగా సంధ్యారాణి సోమవారం సాయంకాలం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.!
- గతంలో ఆమె దాచేపల్లి, మాచర్ల, అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో ఎస్సైగా విధులు సమర్థవంతంగా నిర్వహించారు.!
- బదిలీపై పెదకూరపాడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.!
పల్నాడు జిల్లా
పెదకూరపాడు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సైగా సంధ్యారాణి సోమవారం సాయంకాలం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.!
గతంలో ఆమె దాచేపల్లి, మాచర్ల, అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో ఎస్సైగా విధులు సమర్థవంతంగా నిర్వహించారు.!
బదిలీపై పెదకూరపాడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.!
అనంతరం ఎస్సై సంధ్యారాణి గారు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని స్పష్టం చేశారు.!
ఎవరైనా సంఘవిద్రోహ చర్యలకు అసాధారణ కార్యకలాపాలకు పాల్పడితే వారు ఎంతటి వారిని నైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.!
ముఖ్యంగా యువత గంజాయి తమ్మాకు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు..!