ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. 1972లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించిన ‘మానవ పర్యావరణంపై స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్’ సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని ప్రకటించారు. మొదటి సారిగ 1973 జూన్ 5న ‘ఒకే ఒక్క భూమి’ అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రకృతిని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సంవత్సరం 2026 ‘ప్రకృతి ప్రేరణతో… వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం..’ అనే అధికారిక థీమ్ తో పర్యావరణ దినోత్సవం జరుపబడుతుంది. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ కవితా మాలిక
🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹
సమస్త జీవరాశి నివసిస్తూ పరవశించు సంబంధం
గాలి, నీరు, నేల, ఆకాశం అనుబంధ జీవనానందం
ప్రకృతి మరియు ప్రాణికోటి మధ్య ఉన్న విడదీయరాని బంధం
ప్రాణవాయువు ఆహారం అందించేది పర్యావరణం
చెట్లు నాటి ప్లాస్టిక్ వాడకం మాన్పించుటే ఆరోగ్య జీవనం
ప్రకృతి సమతుల్యత కాపాడుకోవడమే అభివృద్ధికి నీరాజనం
కాలుష్య రహిత పర్యావరణం
ఆరోగ్యకరమైన సమాజాభరణం
ప్రాణశక్తి గమనాన్ని కాపాడుకునే మార్గం
పర్యావరణ పరిరక్షణే భవిష్యత్తు తరాల సంరక్షణo
పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన జలాలు
మానవ మనుగడకు, ఆనందానికి మూలాధారాలు
మానవ జీవన ప్రమాణానికి మూలస్తంభాలు
ప్రకృతితల్లి వెదజల్లు పర్యావరణ పరిమళాలు
భవిష్యత్ తరాలకు నిత్యారోగ్య భాగ్యాలు
ప్రకృతి ఆరాధనే దైవారాధన ఫలాలు
మనం తాగే నీటిలో నాణ్యత
మనం పీల్చే గాలిలో స్వచ్ఛత
స్వార్థ రహిత మానవుడి సమర్థత
ఆలోచనలోనూ ఆచరణలోనూ నిబద్దత
రసాయనాలు లేని పంటలు
పోషక విలువల ఆహార పదార్థాలు
కాలుష్య రహిత గాలి నీరు నేలలు
ఆయు ప్రమాణ దివ్య ఔషధాలు
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి
సౌర, పవన శక్తుల వాడకం పెంచాలి
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వాడాలి
నిత్యజీవితంలో …
గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా జాగ్రత్త పడుదాం
అడవులకు అండగా ఉందాం
పచ్చదనంతో స్నేహం చేద్దాం
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి
జీవాయుప్రమాణ సోపానాన్ని అధిరోహిద్దాం.
🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹


