తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు మేలు చేయాలని సంకల్పంతో భూమి కొలవడానికి లైసెన్స్ సర్వేయర్ల ప్రాముఖ్యత ఎంతో అవసరం ఉందని పదివేల మంది అభ్యర్థులను తీసుకున్నారు అందులో పాసైన అభ్యర్థులు 6,500 మందిని మండలానికి ఆరు నుండి ఎనిమిది మందిని లైసెన్సుడ్ సర్వేయర్లుగా కేటాయించారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటనలో గతంలోనే తెలిపారు వాళ్లకి ఎకరానికి 50 రూపాయలు అని ప్రకటించారు కానీ అది కుదరదు అలా అయితే మేము చేయలేము అని రిసర్వ్ మేము చేయము అని లైసెన్స్ సర్వేయర్లు తెలిపారు కానీ వారికి ఇప్పటివరకు ఎటువంటి పారితోషకం గాని ప్రకటించలేదు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రిసర్వే అని తీసుకున్న లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వనందున తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి లైసెన్స సర్వేయర్లు లిఖితపూర్వకంగా రీ సర్వే చేయము అని పత్రాలు అన్ని జిల్లాలలో వారి యొక్క వినతి పత్రం గౌరవ కలెక్టర్ గారికి మరియు గౌరవ జిల్లా ఏడి గారికి సమర్పించడం జరిగింది లైసెన్సుడు సర్వేయర్ల వినతులు కనీస గౌరవ వేతనం నెలకు 30000 రూపాయలు ఇవ్వాలని వారి యొక్క డిమాండ్ అలాగే వారికి రవాణా సౌకర్యాలు మరియు ఇన్సూరెన్స్ కల్పించాలని వారి యొక్క వినతులు తెలియపరిచారు మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని లైసెన్స్ సర్వేయర్ల వేచి చూస్తున్నారు


