ఖమ్మం 53వ డివిజన్‌లోని నేహా టవర్స్ మహాగణపతి అన్నదాన కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు, కమిటీ తరఫున తొడుపునూరి రవీందర్ ఆహ్వానం మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి శ్రీమతి మంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమెతో పాటు మహిళా మోర్చా జిల్లా నాయకురాలు నాగమణి, స్వర్ణ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ఆచంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుని దర్శించుకుని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు. నిర్వాహకులు వారికి స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.



