SPS నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రాత్రి గడుపుతూ ప్రజలతో మమేకమై భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని గ్రామస్థులకు తెలియజేస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ లేదా సంఘటనలు గమనించిన వెంటనే 112 లేదా 9392903413కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ఇది కీలక కార్యక్రమంగా కొనసాగుతోంది.

నెల్లూరులో “పల్లె నిద్ర”తో పోలీసుల భద్రత అవగాహన