కావలి: పట్టణంలోని ట్రంకురోడ్డు సమీపంలో నిరుపయోగంగా ఉన్న బావిలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికురాలైన కేతా సుజాతమ్మ అటుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక పరికరాల సహాయంతో బావిలోకి దిగి వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం 108 అంబులెన్స్‌లో ఆమెను కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదకరంగా ఉన్న నిరుపయోగ బావులను పూడ్చివేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

నిరుపయోగ బావిలో పడిన వృద్ధురాలు.. అగ్నిమాపక సిబ్బంది రక్షణ