ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలను నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిరుద్యోగ యువకుడు వేణును ఆస్పత్రిలో పరామర్శించిన పువ్వాడ అజయ్ కుమార్, అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వేణు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
బి ఆర్ యస్ జిల్లా అధ్యక్షులు తాత మధు, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వర్రావ్, ఆర్ జె సి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు



