వార్త ముఖ్యాంశాలు
- ఎందుకు వచ్చావో తెలవదు ఎందుకెళ్లావో తెలవదు అర్థం లేని బంధాన్ని అనుక్షణం గుర్తు చేస్తున్నావు ఈ బ్రతుకుని సమాధి చేసి నీ బ్రతుకు పునాది వేసి పోయా వే.!వదిలి పోయావే..!
- ఆశించావు,నన్ను నువ్వు శాసించావు ప్రేమకు అర్థం నేనన్నావు,నా ప్రేమే నీ శ్వాస అన్నావు మరి..!
- ఈ పిచ్చి పిచ్చుక గూటిని వదిలి మరో గూటికేగావే మారాను అంటున్నావు, మారిపోయాను అంటున్నావు గతాన్ని గుర్తుచేయొద్దంటున్నా వు "నీలో ఏదో నచ్చి వస్తారు,ఏదో నచ్చక వదిలి వెళ్తారు" వచ్చి పంచినవి నీకు "జ్ఞాపకాలుగా "మిగిలిపోని వదిలి వెళ్లి చేసిన " గాయం" "గేయంగా "మారిపోనీ..!- --కవి,…
ఎందుకు వచ్చావో తెలవదు
ఎందుకెళ్లావో తెలవదు
అర్థం లేని బంధాన్ని
అనుక్షణం గుర్తు చేస్తున్నావు
ఈ బ్రతుకుని సమాధి చేసి
నీ బ్రతుకు పునాది వేసి
పోయా వే.!వదిలి పోయావే..!
ఆశించావు,నన్ను నువ్వు శాసించావు
ప్రేమకు అర్థం నేనన్నావు,నా ప్రేమే నీ శ్వాస అన్నావు
మరి..!
ఈ పిచ్చి పిచ్చుక గూటిని వదిలి
మరో గూటికేగావే
మారాను అంటున్నావు, మారిపోయాను అంటున్నావు
గతాన్ని గుర్తుచేయొద్దంటున్నా వు
“నీలో ఏదో నచ్చి వస్తారు,ఏదో నచ్చక వదిలి వెళ్తారు”
వచ్చి పంచినవి నీకు “జ్ఞాపకాలుగా “మిగిలిపోని
వదిలి వెళ్లి చేసిన ” గాయం” “గేయంగా “మారిపోనీ..!-
–కవి, రచయిత -కె. రెడ్డప్ప యాదవ్