వార్త ముఖ్యాంశాలు
- భువి పై వెలసిన స్వర్గం తరగని ఆనందాలకు మార్గం ప్రకృతి ఒడిలో ఊగిసలాడే సరాగం అమ్మానాన్నల అనురాగం స్వచ్ఛమైన జీవన యోగం చింతలు లేని స్వాంతన యాగం ఉల్లాసాల ఉత్ప్రేరకాల వనం అల్ప సంతోషాల మూలధనం గడిచిన కాలం కొలిచే అభినందనం బాల్యం ఓ మధుర జ్ఞాపకం…
భువి పై వెలసిన స్వర్గం
తరగని ఆనందాలకు మార్గం
ప్రకృతి ఒడిలో ఊగిసలాడే సరాగం
అమ్మానాన్నల అనురాగం
స్వచ్ఛమైన జీవన యోగం
చింతలు లేని స్వాంతన యాగం
ఉల్లాసాల ఉత్ప్రేరకాల వనం
అల్ప సంతోషాల మూలధనం
గడిచిన కాలం కొలిచే అభినందనం
బాల్యం ఓ మధుర జ్ఞాపకం
కల్మషం లేని నవ్వుల జాతకం
మరపురాని మధురమైన సంతకం
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్