వార్త ముఖ్యాంశాలు
- తెల్లారకనే మేల్కొలిపే అలారాలు సంపాదనలో పోటీపడే జన సంచారాలు అలసటలున్నా ఆశల వెనుక సహకారాలు ట్రాఫిక్ సిగ్నల్స్ తో సాగుతున్న జీవితాలు డిజిటల్ బాటలో గతి తప్పుతున్న బ్రతుకులు డబ్బు సంపాదన పెరిగినా తృప్తినివ్వని పరుగులు అమ్మ చేతి ముద్దకు మద్దతు మసకబారింది అవసరాలే పలకరింపుల ఆర్థిక…
- మానవా మధుర జీవన గమనానికై శాసించే జీవితాల సయ్యాటలకు స్వస్తి చెప్పి శ్వాసించే చిరునవ్వుకు చేయూతనివ్వగ మనసు విప్పి మమత పంచగ మేను చేనులో మమేకమై విహరించగ ప్రతి క్షణాన్ని పరవశించి ఆస్వాదించగ ప్రకృతిని గమనిస్తూ స్వాగతించగ మనోవికాస ఆవాసం వద్ద కాస్సేపు ఆగుదాం
తెల్లారకనే మేల్కొలిపే అలారాలు
సంపాదనలో పోటీపడే జన సంచారాలు
అలసటలున్నా ఆశల వెనుక సహకారాలు
ట్రాఫిక్ సిగ్నల్స్ తో సాగుతున్న జీవితాలు
డిజిటల్ బాటలో గతి తప్పుతున్న బ్రతుకులు
డబ్బు సంపాదన పెరిగినా తృప్తినివ్వని పరుగులు
అమ్మ చేతి ముద్దకు మద్దతు మసకబారింది
అవసరాలే పలకరింపుల ఆర్థిక బంధమైంది
కన్నవారిని ఒంటరితనమే పలకరిస్తుంది
కాలంతో పోటీ పడుతూ నిద్రలేమిని తట్టిలేపుతూ
కలలో కూడా కవ్విస్తున్న అధునాతన కంప్యూటర్లు
ఆత్మీయతలేని ప్రయాణంలో నివాసాలు
నిలకడలేని వినిపించలేని అంతరంగాలు
విశ్రాంతి బ్రాంతిలో వినోదాల వెతుకులాటలు
గమ్యం తెలియని గుండె లయలతో గుసగుసలు
సతమతమవుతున్న జీవనాధార నిర్ణయాలు
లక్ష్యాలను చేరుకుంటున్నా నిర్లక్ష్యమవుతున్న ఆరోగ్యాలు
అందుకే …
మానవా మధుర జీవన గమనానికై
శాసించే జీవితాల సయ్యాటలకు స్వస్తి చెప్పి
శ్వాసించే చిరునవ్వుకు చేయూతనివ్వగ
మనసు విప్పి మమత పంచగ
మేను చేనులో మమేకమై విహరించగ
ప్రతి క్షణాన్ని పరవశించి ఆస్వాదించగ
ప్రకృతిని గమనిస్తూ స్వాగతించగ
మనోవికాస ఆవాసం వద్ద కాస్సేపు ఆగుదాం
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్