నంద్యాల : వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్ జెల్లిపల్లి దిలీప్ కుమార్, ఆయన సోదరుడు జెల్లిపల్లి అశోక్ కుమార్ తమ 1,000 మంది అనుచరులతో టీడీపీలో చేరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వెంకటాచలం కాలనీ నుంచి దేవనగర్ బీసీ హాస్టల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దిలీప్ కుమార్, అశోక్ కుమార్ చేరికతో టీడీపీ మరింత బలోపేతమైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాలలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ