Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యదర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామంలో భక్తి పరవశంగా, వైభవంగా నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగముల దివ్య దర్శనం కార్యక్రమం విశేషంగా జరిగింది.
  • గ్రామంలోని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమాగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జ్యోతిర్లింగాల దర్శనం పొందారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.

సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామంలో భక్తి పరవశంగా, వైభవంగా నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగముల దివ్య దర్శనం కార్యక్రమం విశేషంగా జరిగింది. గ్రామంలోని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమాగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జ్యోతిర్లింగాల దర్శనం పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, నైతికత, సానుకూలత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. “భగవంతుని సన్నిధిలో జరిగే ఈ దివ్య దర్శనం మనసుకు శాంతినివ్వడమే కాక, జీవన విధానంలో జ్ఞానాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఇస్తుంది” అని అన్నారు. ప్రజలు ఆధ్యాత్మికతను జీవితంలో భాగంగా చేసుకుంటే సమాజం మరింత సుస్థిరంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల నడుమ శివభక్తి నినాదాలు మార్మోగగా, జరిగిన వేడుకలు ప్రాంతమంతా ఉత్సాహాన్ని నింపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *