Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేపూరులో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దేపూరులో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

వార్త ముఖ్యాంశాలు

  • మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు..
  • భారీ అన్నదాన కార్యక్రమం ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలోని సీతా సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
  • ఆలయంలో తొలి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.ఉత్సవాల్లో భాగంగా మొదటి, రెండవ రోజుల్లో ప్రత్యేక హోమాలు, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.

మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు.. భారీ అన్నదాన కార్యక్రమం

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలోని సీతా సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో తొలి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.ఉత్సవాల్లో భాగంగా మొదటి, రెండవ రోజుల్లో ప్రత్యేక హోమాలు, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సుభిక్షం, ప్రజల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ గ్రామ పరిధిలో సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత గ్రామ రక్షణ బొడ్డురాళ్ల స్థానంలో కొత్త గమిడరాళ్లను ప్రతిష్ఠించారు.చివరి రోజు నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి దేపూరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్థులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. కల్యాణ వేడుకల అనంతరం భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు కే. శ్రీనివాసులు నాయుడు, సిద్ధవటం రమణారెడ్డి, ముక్కముళ్ల భాస్కర్ రెడ్డి, చిత్తబత్తిన కొండయ్య తదితరులు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. తొలి వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *