Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలువాయి : నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..ఒకే పార్టీ.. రెండు వర్గాలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలువాయి : నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..ఒకే పార్టీ.. రెండు వర్గాలు..

వార్త ముఖ్యాంశాలు

  • కలువాయి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
  • టీడీపీలో రెండు వర్గాల మధ్య గొడవ కలువాయి: కలువాయి పంచాయతీ నామినేషన్ కేంద్రం వద్ద ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది.
  • నామినేషన్ల దాఖలు సందర్భంగా ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి హల్‌చల్ చేశాయి.వివరాల్లోకి వెళితే..

కలువాయి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. టీడీపీలో రెండు వర్గాల మధ్య గొడవ

కలువాయి: కలువాయి పంచాయతీ నామినేషన్ కేంద్రం వద్ద ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి హల్‌చల్ చేశాయి.వివరాల్లోకి వెళితే.. 2వ వార్డు టీడీపీ అభ్యర్థి మితికాయల రమేశ్ బాబు నామినేషన్ పత్రాలను చల్లా శివారెడ్డి, తేజారెడ్డి చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే 7వ వార్డు అభ్యర్థి పువ్వాడి మల్లికార్జున్‌ను చొక్కా పట్టుకుని బయటకు లాగినట్లు స్థానికులు తెలిపారు . దీంతో నామినేషన్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలువాయి,ఎస్‌ఐ కోటయ్య ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *