తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలి.. ఒంగోలు మహాధర్నాను జయప్రదం చేయాలి
లింగసముద్రం: తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఒంగోలులో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం లింగసముద్రం మండలం చిన్నపవని, రాళ్లపాడు, వలేటివారిపాలెం మండలం శాఖవరం గ్రామాల్లో కరపత్రాలు ఆవిష్కరించారు. తౌషిక్ మరణంపై సీబీఐ విచారణ జరిపించి, బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పందిటి అంబేద్కర్ మాదిగ, గౌడుపేరు కాంతారావు మాదిగ తదితర నాయకులు, ముస్లిం మైనారిటీ పెద్దలు, యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
