Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ఎస్ఐగా బి. మహేంద్ర బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు ఎస్ఐగా బి. మహేంద్ర బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: మండల నూతన ఎస్ఐగా బి.
  • మహేంద్ర ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
  • ఇప్పటివరకు దుత్తలూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గంగుల సుభాషిని ఇటీవల బదిలీ అయ్యారు.

దుత్తలూరు: మండల నూతన ఎస్ఐగా బి. మహేంద్ర ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు దుత్తలూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గంగుల సుభాషిని ఇటీవల బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉదయగిరిలో ఎస్ఐగా పనిచేస్తున్న బి. మహేంద్రను దుత్తలూరు పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా నియమించారు. ఈ మేరకు ఆయన ఆదివారం పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని మహేంద్ర తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలని ఆయన కోరినట్లు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *