Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దుత్తలూరు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బి.
  • మహేంద్ర ఆదివారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్సై మహేంద్రతో ఆప్యాయంగా మాట్లాడి, నూతన బాధ్యతల స్వీకరణకు శుభాకాంక్షలు తెలిపారు.

దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
దుత్తలూరు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బి. మహేంద్ర ఆదివారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్సై మహేంద్రతో ఆప్యాయంగా మాట్లాడి, నూతన బాధ్యతల స్వీకరణకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ దుత్తలూరు మండలంలో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *