Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

తెలుగుదేశం పార్టీ రెడ్డిగూడెం ఉప సర్పం చి వెంకట్రావు అభినందించిన ఎంపీపీ నాగేశ్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలుగుదేశం పార్టీ రెడ్డిగూడెం ఉప సర్పం చి వెంకట్రావు అభినందించిన ఎంపీపీ నాగేశ్ రెడ్డి

*రెడ్డిగూడెం ఉపసర్పంచిగా అంకమ్మరావు(వెంకట్రావు)*
ఈ సందర్భంగా వేముల వెంకట్రావును
రెడ్డిగూడెం మండల ఎంపీపీ
శ్రీ ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారు
బీసీ నాయకులు మండల వైస్ ఎంపీపీ
కోటేశ్వరరావు గారు
తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్
జానలపాటి వేణుగోపాల్ రెడ్డి గారు
గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్
చాట్ల చందా గారు
వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు
బీసీ వర్గానికి ప్రాధాన్యత కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన నాయకులు

రెడ్డిగూడెం: ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెడ్డిగూడెం మండల కేంద్రంలోని రెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 14 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు 8 వార్డులను కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 6 వార్డుల్లో విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 10వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వెంకట్రావు తన సమీప ప్రత్యర్థిపై 19 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో వేముల వెంకట్రావును ఉపసర్పంచిగా ఎన్నుకున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన వేముల వెంకట్రావుకు ఉపసర్పంచ్ పదవి దక్కడం పట్ల గ్రామంలోని బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధిలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగేందుకు ఈ ఎన్నిక దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

గ్రామ పంచాయతీ పాలనలో ఉపసర్పంచ్ పదవి కీలకమైనది. గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా చూడటంలో ఉపసర్పంచ్ బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఉపసర్పంచిగా ఎన్నికైన వేముల వెంకట్రావు గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు బీసీ నాయకులు, సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగుదేశం పార్టీ రెడ్డిగూడెం ఉప సర్పం చి వెంకట్రావు అభినందించిన ఎంపీపీ నాగేశ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ రెడ్డిగూడెం ఉప సర్పం చి వెంకట్రావు అభినందించిన ఎంపీపీ నాగేశ్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *