*వెల్వడంలో వైసీపీ జెండా.. తిరుమలకు భారీ మెజార్టీ*
*అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన వైసీపీ మద్దతుదారు తిరుమల*
*సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన తోట తిరుపతిరావు సతీమణి తిరుమల గారు*
*మొక్కు తీర్చుకునేందుకు జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి తోట తిరుపతిరావు పాదయాత్ర*
*మైలవరం మండలం వెల్వడం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో పోటీ చేసిన తోట తిరుపతిరావు సతీమణి తిరుమల భారీ మెజార్టీతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అధికార కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తూ ప్రజల మద్దతును చాటుకున్నారు. గ్రామంలో నెలకొన్న రాజకీయ సమీకరణాల మధ్య ఓటర్లు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి.*
*ఈ విజయంపై తోట తిరుపతిరావు మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులు, గ్రామ ప్రజల ఆదరణ, మద్దతుదారుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.*
*భార్య తిరుమల వైసీపీ మద్దతుతో సర్పంచ్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేసిన తిరుపతిరావు, ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా తన మొక్కును తీర్చుకునేందుకు వెల్వడం గ్రామం నుంచి జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ప్రజల తీర్పును దైవప్రసాదంగా భావిస్తూ స్వామివారి దర్శనానికి పాదయాత్ర చేపట్టారు.*

