పున్నమి న్యూస్ రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కీర్తి చేకూరి బాధ్యతల స్వీకరణ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి నూతనంగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలు, ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణ, సంబంధిత అధికారులు అందించిన నివేదికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నూతనంగా ఏర్పాటు కానున్న తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేలా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన పరిపాలనా, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సేకరించి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనాన్ని గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శాశ్వత కార్యాలయ భవనం గుర్తించి ఏర్పాటు చేసే వరకు తాత్కాలికంగా రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, రికార్డులు, పరిపాలనా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించి, కార్యాలయ కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా పరిషత్‌కు సంబంధించిన రికార్డులు, ఆస్తులు, సిబ్బంది, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా అంశాలు తదితర వివరాలను నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలో సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసి, నూతన జిల్లా పరిషత్ పరిపాలనా వ్యవస్థను సమర్థవంతంగా అమల్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ల అభివృద్ధి అధికారి పి. వీణాదేవి, తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
పున్నమి న్యూస్ రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కీర్తి చేకూరి బాధ్యతల స్వీకరణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి నూతనంగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలు, ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణ, సంబంధిత అధికారులు అందించిన నివేదికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేలా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన పరిపాలనా, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సేకరించి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనాన్ని గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శాశ్వత కార్యాలయ భవనం గుర్తించి ఏర్పాటు చేసే వరకు తాత్కాలికంగా రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, రికార్డులు, పరిపాలనా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించి, కార్యాలయ కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన రికార్డులు, ఆస్తులు, సిబ్బంది, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా అంశాలు తదితర వివరాలను నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలో సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసి, నూతన జిల్లా పరిషత్ పరిపాలనా వ్యవస్థను సమర్థవంతంగా అమల్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల అభివృద్ధి అధికారి పి. వీణాదేవి, తదితరులు పాల్గొన్నారు.

