ఖానాపూర్ పున్నమి ప్రతినిధి: ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం బాల గ్రామసభ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పిల్లల విద్య, పాఠశాలల్లో మౌలిక వసతులు, సెల్‌ఫోన్ వినియోగ నియంత్రణ, బాలల హక్కులు, బాల్యవివాహాల నిర్మూలన, డ్రగ్స్ దుష్ప్రభావాలపై చర్చించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారి విద్యా, ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాన్ని బాలలకు అనుకూలమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి, రాజు, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
