డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని తాటిపాక పీహెచ్‌సీ వైద్యాధికారి ఫణి కిరణ్‌కు 104 సిబ్బంది తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. గతంలో సమ్మె సమయంలో కొంతమంది ఉద్యోగులను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ, వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఈఓలకు రూ.18,500 వేతనం చెల్లించాలని, 104 విభాగంలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు. లేకపోతే అక్టోబర్ 12 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టాల్సి వస్తుందని 104 సిబ్బంది హెచ్చరించారు.

డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 12 తర్వాత 104 సిబ్బంది సమ్మె