బయ్యారం: మండలస్థాయిలో ఈ నెల 7, 8 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మహబూబాబాద్ జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. వాలీబాల్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పాఠశాల జట్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఖోఖో జూనియర్ విభాగంలో నలుగురు, సీనియర్ విభాగంలో ముగ్గురు, కబడ్డీ సీనియర్ విభాగంలో ముగ్గురు విద్యార్థులు జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ బాణోతు వాలు, విజేత విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా. బి. శోభన్‌బాబు అభినందించారు. జోనల్ స్థాయి నుంచి జాతీయ స్థాయిలోనూ ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు.



