Friday, 29 May 2026
  • Home  
  • జూన్‌ 4 నుంచి 12 వరకు భారీగా నిరసనలు .. జిల్లా వైసిపి అధ్యక్షుడు కాకాణి…
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జూన్‌ 4 నుంచి 12 వరకు భారీగా నిరసనలు .. జిల్లా వైసిపి అధ్యక్షుడు కాకాణి…

రెండేళ్ల చంద్రబాబు పాలనా వైఫల్యాల పై వెన్ను పోటు కు రెండేళ్లు పుస్తకం విడుదల చేసి,జూన్ నాలుగు నుంచి పన్నెండు వరకు భారీగా నిరసనలు చేపట్టాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి లో జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జిల్లా కు చెందిన పలువురు నేతలతో పాల్గొన్నారు. . ఒకవైపు ఎస్‌ఐఆర్‌ కారణంగా, కమిటీల వెరిఫికేషన్‌, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్‌ కారణంగా, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్‌ రూపొందించడం జరిగిందని తెలిపారు.జూన్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలలో చంద్రబాబునాయుడుకి సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ఈనాడులో ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ కాపీ, బాండ్లు ఏదైతే ఇచ్చారో, పవన్‌ కల్యాణ్, చంద్రబాబునాయుడు ఫొటోలతో సంతకాలు చెప్పి బాండ్లు ఏదైతే ఇచ్చారో, ఆ బాండ్ల కాపీలు నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకూ కూడా అంద చేయాలని జగన్ ఆదేశించారని తెలిపారు. ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు, బాండ్లు. ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తేదీన ఈ చూపిస్తూ మండల కేంద్రాల్లో నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అదే జూన్‌ 4న మండల కేంద్రాల్లో . ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పాలు పంచుకోవాలని. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించారని తెలిపారు.తరువాత జూన్‌ 8, 9 తేదీల్లో తమ వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్‌ హాల్‌ సదస్సు ఉంటుందని. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు పుస్తకంలోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. చివరగా జూన్‌ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాలని. ఈ కార్యక్రమాన్ని స్వయంగా జగన్ కూడా పర్యవేక్షించడం జరుగుతుందని,. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదని. ప్రజలకు చేసిన వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ ఆదేశించారని కాకాణి తెలిపారు.

రెండేళ్ల చంద్రబాబు పాలనా వైఫల్యాల పై వెన్ను పోటు కు రెండేళ్లు పుస్తకం విడుదల చేసి,జూన్ నాలుగు నుంచి పన్నెండు వరకు భారీగా నిరసనలు చేపట్టాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
బుధవారం తాడేపల్లి లో జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జిల్లా కు చెందిన పలువురు నేతలతో పాల్గొన్నారు.
. ఒకవైపు ఎస్‌ఐఆర్‌ కారణంగా, కమిటీల వెరిఫికేషన్‌, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్‌ కారణంగా, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్‌ రూపొందించడం జరిగిందని తెలిపారు.జూన్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలలో చంద్రబాబునాయుడుకి సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ఈనాడులో ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ కాపీ, బాండ్లు ఏదైతే ఇచ్చారో, పవన్‌ కల్యాణ్, చంద్రబాబునాయుడు ఫొటోలతో సంతకాలు చెప్పి బాండ్లు ఏదైతే ఇచ్చారో, ఆ బాండ్ల కాపీలు నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకూ కూడా అంద చేయాలని జగన్ ఆదేశించారని తెలిపారు. ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు, బాండ్లు. ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తేదీన ఈ
చూపిస్తూ మండల కేంద్రాల్లో నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అదే జూన్‌ 4న మండల కేంద్రాల్లో . ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పాలు పంచుకోవాలని. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించారని తెలిపారు.తరువాత జూన్‌ 8, 9 తేదీల్లో తమ వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్‌ హాల్‌ సదస్సు ఉంటుందని. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు పుస్తకంలోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
చివరగా జూన్‌ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాలని. ఈ కార్యక్రమాన్ని స్వయంగా జగన్ కూడా పర్యవేక్షించడం జరుగుతుందని,. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదని. ప్రజలకు చేసిన వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ ఆదేశించారని కాకాణి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.