Saturday, 13 June 2026
  • Home  
  • “జూన్ 16న బొమ్మూరు కలెక్టరేట్ మెగా జాబ్ మేళా*
- విద్య విజ్ఞానం

“జూన్ 16న బొమ్మూరు కలెక్టరేట్ మెగా జాబ్ మేళా*

పత్రికా ప్రకటన రాజమహేంద్రవరం, తేదీ:13.6.2026 “జూన్ 16న బొమ్మూరు కలెక్టరేట్ మెగా జాబ్ మేళా* *స్థానిక నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం* *రాజమహేంద్రవరం పరిసరాల్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు* — జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష…. తూర్పు గోదావరి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 16వ తేదీ (మంగళవారం) ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం రూరల్ కలెక్టరేట్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రకటించిన ఖాళీలన్నీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని స్థానిక ఉద్యోగాలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో త్రివేణి గ్లాస్, ఠాగూర్ లాబొరేటరీస్, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్, పాటిల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్ చైత్ టెక్నాలజీస్, డి-మార్ట్, కిసాన్ మార్ట్, ఇండియన్ డైరీ ఎక్విప్‌మెంట్స్ అండ్ ఫ్యాబ్రికేటర్స్, శ్రీ భవాని క్యాస్టింగ్స్ తదితర సంస్థలు పాల్గొని వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాటిల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారతీయ రైల్వేతో అనుసంధానమై రైలు బోగీల తయారీలో పనిచేస్తోందని, అలాగే ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసి అర్హులైన అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆర్టీసీలో నియమించే అవకాశం ఉంటుందని వివరించారు. కొవ్వూరు టోల్‌గేట్ సమీపంలో ఉన్న ఠాగూర్ లాబొరేటరీస్ సంస్థ ఉద్యోగులకు కంపెనీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోందని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ (సెరామిక్/ఇన్‌స్ట్రుమెంటేషన్), ఏదైనా డిగ్రీ, బీటెక్ మెకానికల్ అర్హత కలిగి, 19 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా employment.ap.gov.in⁠� ద్వారా నమోదు చేసుకుని, రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు. స్థానిక ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్న ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జిల్లా సమాచార & పౌర సంబంధాల శాఖ ద్వారా విడుదల

పత్రికా ప్రకటన

రాజమహేంద్రవరం, తేదీ:13.6.2026

“జూన్ 16న బొమ్మూరు కలెక్టరేట్ మెగా జాబ్ మేళా*

*స్థానిక నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం*

*రాజమహేంద్రవరం పరిసరాల్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు*

— జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష….

తూర్పు గోదావరి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 16వ తేదీ (మంగళవారం) ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం రూరల్ కలెక్టరేట్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళాలో ప్రకటించిన ఖాళీలన్నీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని స్థానిక ఉద్యోగాలేనని ఆమె స్పష్టం చేశారు.

ఈ జాబ్ మేళాలో త్రివేణి గ్లాస్, ఠాగూర్ లాబొరేటరీస్, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్, పాటిల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్ చైత్ టెక్నాలజీస్, డి-మార్ట్, కిసాన్ మార్ట్, ఇండియన్ డైరీ ఎక్విప్‌మెంట్స్ అండ్ ఫ్యాబ్రికేటర్స్, శ్రీ భవాని క్యాస్టింగ్స్ తదితర సంస్థలు పాల్గొని వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పాటిల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారతీయ రైల్వేతో అనుసంధానమై రైలు బోగీల తయారీలో పనిచేస్తోందని, అలాగే ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసి అర్హులైన అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆర్టీసీలో నియమించే అవకాశం ఉంటుందని వివరించారు.

కొవ్వూరు టోల్‌గేట్ సమీపంలో ఉన్న ఠాగూర్ లాబొరేటరీస్ సంస్థ ఉద్యోగులకు కంపెనీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోందని తెలిపారు.
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ (సెరామిక్/ఇన్‌స్ట్రుమెంటేషన్), ఏదైనా డిగ్రీ, బీటెక్ మెకానికల్ అర్హత కలిగి, 19 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా employment.ap.gov.in⁠� ద్వారా నమోదు చేసుకుని, రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.

మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు. స్థానిక ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్న ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

జిల్లా సమాచార & పౌర సంబంధాల శాఖ ద్వారా విడుదల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.