*ఎన్టీఆర్ జిల్లా మైలవరం.*
*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జి. కొండూరు మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన డాక్టర్ రేవతి చంద్రిక గారికి సన్మానం.*
*విద్యా ప్రతిభకు.. ప్రజా విజయానికి వసంత అభినందనల అభిషేకం!*
*జి.కొండూరు జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన డాక్టర్ వేములకొండ రేవతి చంద్రికకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ప్రత్యేక సత్కారం.*
*ఉన్నత విద్యావంతురాలిగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి.. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.*
*పదవి అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత: ఎమ్మెల్యే వసంత.*
*విద్యతో ఉన్నతంగా ఎదిగి.. ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా మరో కీలక బాధ్యతను చేపట్టిన డాక్టర్ వేములకొండ రేవతి చంద్రిక గారిని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. జి.కొండూరు మండల జడ్పీటీసీ సభ్యురాలిగా ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించిన ఆమెను ప్రశంసిస్తూ, ఉన్నత విద్యావంతురాలిగా తన విద్యా విజ్ఞానాన్ని ప్రజాసేవకు వినియోగించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.*
*మంగళవారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి స్వగ్రామమైన ఐతవరంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల గౌరవార్థం నిర్వహించిన ఆత్మీయ సమావేశం, విజయోత్సవ సన్మాన సభలో ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వేములకొండ రేవతి చంద్రిక గారిని ఘనంగా సత్కరించి, ఆమె సాధించిన విజయాన్ని అభినందించారు. రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు విద్యా ప్రతిభ, సేవాభావం, కార్యదక్షతతో ప్రజల మన్ననలు పొందుతూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.*
*విద్యా ప్రతిభకు ప్రజాసేవ తోడైతే మరింత ఉన్నత స్థానం!*
*డాక్టర్ వేములకొండ రేవతి చంద్రిక గారు ఉన్నత విద్యావంతురాలిగా జి.కొండూరు మండల ప్రజల విశ్వాసాన్ని చూరగొని జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నిక కావడం అభినందనీయమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను అత్యంత గౌరవంగా స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, యువత, గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ నిస్వార్థంగా సేవలందించాలని పిలుపునిచ్చారు.*
*ఒక ప్రజాప్రతినిధి విజయానికి ఎన్నికల ఫలితాలు కొలమానం అయితే, ఆ విజయానికి సార్థకత ప్రజలకు అందించే సేవల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేస్తే మరిన్ని ఉన్నత అవకాశాలు, గౌరవప్రదమైన స్థానాలు సహజంగానే లభిస్తాయని అన్నారు. డాక్టర్ రేవతి చంద్రిక గారు భవిష్యత్తులో మరింతగా ఎదుగుతూ ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.*
*కూటమి ఐక్యతకు ప్రజల విజయతిలకం.. బాధ్యత మరింత పెరిగింది!*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి, మూడు పార్టీల ఐక్యతకు, నాయకులు, కార్యకర్తల అవిశ్రాంత కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కొండపల్లి పురపాలక సంఘంలో 40 స్థానాలకు గాను 33 స్థానాలు, ఐదు మండలాల్లో 73 ఎంపీటీసీ స్థానాలకు గాను 62 స్థానాలు, ఐదింటికి ఐదు జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం ప్రజలిచ్చిన ఘనమైన తీర్పుగా అభివర్ణించారు.*
*ఈ విజయాలు బాధ్యతను మరింత పెంచాయని, పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామగ్రామాన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యత, సమన్వయం కొనసాగిస్తూ కూటమి విజయ పరంపరను కొనసాగించాలని పిలుపునిచ్చారు.*
*ఘనంగా జరిగిన ఆత్మీయ సత్కార సభ.*
*తొలుత అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కూటమి తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన పురపాలక సంఘ కౌన్సిలర్లు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించి అభినందించారు.*
*ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, జనసేన మైలవరం నియోజకవర్గ బాధ్యులు అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*
*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

