వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల:జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు చురుకైన భాగస్వామ్యం అందించాలని కలెక్టర్ జి.
- రాజకుమారి సూచించారు.
- శనివారం కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించి వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.రైతుల ఆదాయం పెంచేందుకు కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ రంగాలకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు.
నంద్యాల:జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు చురుకైన భాగస్వామ్యం అందించాలని కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించి వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.రైతుల ఆదాయం పెంచేందుకు కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ రంగాలకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలు, చిరు వ్యాపారులు, పశుపోషకులు, యువ పారిశ్రామికవేత్తలకు చేయూతనందించాలని ఆదేశించారు. అగ్రి ఇన్‌ఫ్రా, సౌర విద్యుత్, గృహ నిర్మాణ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు