Tuesday, 29 September 2026
  • Home  
  • జాషువా భగత్ సింగ్ సేవలు మంచివని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
- ఎన్ టి ఆర్ జిల్లా

జాషువా భగత్ సింగ్ సేవలు మంచివని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

*జాషువా, భగత్‌సింగ్‌ సేవలు చిరస్మరణీయం: మాజీ మంత్రి దేవినేని ఉమా* గొల్లపూడి (సెప్టెంబర్ 28): మహాకవి గుర్రం జాషువా, యువ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో వారి చిత్రపటాలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి జాషువా, భగత్‌సింగ్‌ అందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. “రాజు మరణిస్తే శిలా విగ్రహాలలో ఉంటాడు.. కవి మరణిస్తే ప్రజల నాలుకలపై ఉంటాడు” అన్న జాషువా మాటలు ఆయన సాహిత్య ప్రతిభకు, ప్రజలపై ఆయన రచనల ప్రభావానికి అద్దం పడుతున్నాయని తెలిపారు. ‘గబ్బిలం’ వంటి రచనలతో సామాజిక చైతన్యాన్ని రగిలించిన జాషువా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అదేవిధంగా, చిన్న వయసులోనే బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన మహనీయుడు భగత్‌సింగ్‌ అని కొనియాడారు. నాడు జాషువా, భగత్‌సింగ్‌ వంటి మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని అన్నారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.

*జాషువా, భగత్‌సింగ్‌ సేవలు చిరస్మరణీయం: మాజీ మంత్రి దేవినేని ఉమా*

గొల్లపూడి (సెప్టెంబర్ 28): మహాకవి గుర్రం జాషువా, యువ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో వారి చిత్రపటాలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి జాషువా, భగత్‌సింగ్‌ అందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.

“రాజు మరణిస్తే శిలా విగ్రహాలలో ఉంటాడు.. కవి మరణిస్తే ప్రజల నాలుకలపై ఉంటాడు” అన్న జాషువా మాటలు ఆయన సాహిత్య ప్రతిభకు, ప్రజలపై ఆయన రచనల ప్రభావానికి అద్దం పడుతున్నాయని తెలిపారు. ‘గబ్బిలం’ వంటి రచనలతో సామాజిక చైతన్యాన్ని రగిలించిన జాషువా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

అదేవిధంగా, చిన్న వయసులోనే బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన మహనీయుడు భగత్‌సింగ్‌ అని కొనియాడారు. నాడు జాషువా, భగత్‌సింగ్‌ వంటి మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని అన్నారు.

వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.