Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం:బనుక శివరాజ్ యాదవ్ మార్కెట్ చైర్మన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం:బనుక శివరాజ్ యాదవ్ మార్కెట్ చైర్మన్

*జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం*

✓ జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లో ఉన్న నూతన కార్యాలయం లో AMC పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
✓ఈ సందర్భంగా పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
✓ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా AMC చైర్మన్ సంతకం లేకుండా సెప్టెంబర్ 2026 కి సంబంధించిన చెక్కులు కేవలం సెక్రటరీ సంతకం చేసి, చైర్మన్ బనుక శివరాజు సంతకం లేకుండా AMC కార్యాలయం లో విధులు నిర్వర్తిస్తున్న వాచ్ మెన్ కె.ఐలయ్య STO ద్వారా చెక్కులు పాస్ చేపించి విషయం తెలుసుకున్న AMC చైర్మన్ సిబ్బందిని నిలదీయగా చైర్మన్ పట్ల దుర్సుగా ప్రవర్తించిన వ్యవహారంలో కె.ఐలయ్య ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎంసీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి డిఎంఓ (DMO) గారికి తీర్మానం పత్రం అందజేయడం జరిగింది.
✓అనంతరం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ నిరంతరం మా పాలకవర్గం మరియు నేను రైతులకు వ్యాపారులకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా మా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది అలాంటిది మాకు తెలియకుండానే మా సంతకం లేకుండానే చెక్కులు దుర్వినియోగం చేసిన అతనిపై మేము ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.
✓గతంలో కూడా అవినీతి పాల్పడిన వారిపై మరియు విధులు సక్రమంగా నిర్వహించని అధికారులు కానీ సిబ్బంది పై ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు పిర్యాదులు చేసి ఉన్నాము అని కూడా వారు తెలిపారు.

✓అదేవిధంగా వచ్చే సీజన్ లో రైతుల కోసం అన్ని ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది మరియు మార్కెట్ అభివృద్ధి కోసం సాంక్షన్ అయిన పనుల వివరాలు గురించి అధికారులతో వాకప్ చేయడం జరిగింది అని అన్నారు.
✓ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్లు నాగబండి రవీందర్, నీల మోహన్, బుట్ రెడ్డి శ్రీలత రెడ్డి, ఎండి బాష్మియా, నామాల శ్రీనివాస్,తోటకూరి రమేష్, బానోతు బన్సీ నాయక్, శీలం కొండల్ రెడ్డి, పార్ష సిద్దేష్, బండ కుమార్, నాయకులు రాజిరెడ్డి,ప్రభాకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం:బనుక శివరాజ్ యాదవ్ మార్కెట్ చైర్మన్

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ముఖ్య సమావేశం:బనుక శివరాజ్ యాదవ్ మార్కెట్ చైర్మన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *