Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జనగామ లో భారీ యాత్ర తో భారత్ సంకల్ప సభ విజవంతం : సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనగామ లో భారీ యాత్ర తో భారత్ సంకల్ప సభ విజవంతం : సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 12 సంవత్సరములు ప్రజా జీవితంలో 25 సంవత్సరంలో పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో కామాక్షి ఫంక్షన్ హాల్ లో వికసిత్. భారత్ సంకల్ప సభ నిర్వహించడం జరిగింది.ఎల్ ఈ డి స్క్రీన్ ఏర్పాటు చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని వీక్షించి అనంతరం నెహ్రూ పార్క్ నుండి జనగాం అంబేద్కర్ చౌరస్తా వరకు సేవా జ్యోతి యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు
క్రాంతి కిరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ సంక్షేమం కోసం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగిందని దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిపిన ఘనత మోడీ దని తెలంగాణకు ఎయిమ్స్, ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన యూనివర్సిటీ వరంగల్ కు ఏర్పోర్ట్, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రధానంగా జనగామ కు రైల్వే స్టేషన్ కోట్ల రూపాయలతో ఆధునీకర వస్తువులతో నిర్మాణం చేయడం జరిగిందని వారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాత్ర ప్రముఖ్ వల్ల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి, శివరాజ్ యాదవ్, ఉడుముల రమేష్, పాకనాటి దామోదర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి అంజిరెడ్డి నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి,రంగు రాములు, పల్లె కుమార్ వివిధ మోర్చాల అధ్యక్షులు మండల అధ్యక్షులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనగామ లో భారీ యాత్ర తో భారత్ సంకల్ప సభ విజవంతం : సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

జనగామ లో భారీ యాత్ర తో భారత్ సంకల్ప సభ విజవంతం : సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

జనగామ లో భారీ యాత్ర తో భారత్ సంకల్ప సభ విజవంతం : సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *