వార్త ముఖ్యాంశాలు
- స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎస్.
- కరుణాకర్ మాట్లాడుతూ..
స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎస్. కరుణాకర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో సహజ వనరులతో తయారు చేసే ఎరువులు, పురుగుమందులను వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చని తెలిపారు. రసాయనిక పురుగుమందుల అధిక వినియోగాన్ని తగ్గించడం వల్ల ఆహార ధాన్యాల్లో రసాయనాల అవశేష ప్రభావాన్ని తగ్గించి, ప్రజలకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చని ఆయన విశదీకరించారు.
ఎన్‌ఏఎంఎన్‌ఎఫ్ (NMNF) పద్ధతిలో సాగు చేస్తున్న వరి పొలంలో వర్మీకంపోస్ట్‌ను సమర్థవంతంగా వినియోగించి నేల సారాన్ని పెంపొందించడంతో పాటు, పంటకు అవసరమైన పోషకాలను పూర్తిగా సహజ పద్ధతుల్లో అందించవచ్చని రైతులకు క్షేత్రస్థాయిలో ప్రదర్శన ద్వారా వివరించారు. జనగామ జిల్లా ఎన్‌ఏఎంఎన్‌ఎఫ్ కోఆర్డినేటర్ హరీష్ విచ్చేసి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సహజ ఎరువుల తయారీ విధానం మరియు వాటి సరైన వినియోగంపై సమగ్రమైన శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్కెర స్వరూప, ఏఈఓ శ్రావణి, గ్రామ కార్యదర్శి స్వప్నతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు.