చెన్నరావుపేట: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. చెన్నరావుపేటలోని సిద్ధార్థ హైస్కూల్లో శంకర కంటి ఆసుపత్రి, జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో 3వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కంది గోపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ శిబిరంలో 677 మందికి కంటి పరీక్షలు చేసి, 412 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. తీవ్రమైన కంటి సమస్యలు ఉన్న 65 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం హైదరాబాద్లోని శంకర్ ఐ హాస్పిటల్కు ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలోనూ ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.



