ఖమ్మం ఆగష్టు 6
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం నగరంలోని దంసలాపురం మున్నేరు వంతెన సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న చింతకాని మండలం గాంధీనగర్‌కు చెందిన పోకబత్తిన నర్సింహారావు, సుజాత మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. కారు నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



