శ్రీ కాళహస్తి, ఆగస్టు 01, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని కసా గార్డెన్ సమీపంలో ఉన్న గురుకుల బాలికల సంక్షేమ కళాశాలను జనసేన పార్టీ నాయకులు శనివారం సందర్శించి విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టారు. కళాశాల వసతి గృహంలోని స్నానశాలల వద్దకు వెళ్లే మార్గం రహదారిపై ప్రయాణించే వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో విద్యార్థినుల గోప్యతకు భంగం కలుగుతోందని కళాశాల యాజమాన్యం వారి దృష్టికి తీసుకెళ్లింది. విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకుడు కొట్టే సాయి ప్రసాద్ కళాశాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థినుల భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని స్నానశాలల పరిసరాల్లో గ్రీన్ షేడ్ నెట్‌ను వెంటనే ఏర్పాటు చేయించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, విద్యార్థినులతో మాట్లాడిన కొట్టే సాయి ప్రసాద్, విద్యార్థినులు విద్యతో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభ కనబరిచేలా అవసరమైన క్రీడా దుస్తులను త్వరలో ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల సమస్యపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన జనసేన నాయకులకు కళాశాల యాజమాన్యం, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుమార్, ఢిల్లీ బాబు, చిరంజీవి, భరత్‌తో పాటు కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గురుకుల కళాశాలలో విద్యార్థినుల సమస్యకు జనసేన నేతల తక్షణ పరిష్కారం