ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ పర్యటించనున్నట్లు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్ తెలిపారు. పర్యటనలో భాగంగా నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని అనంతరం SC మోర్చా జిల్లా సమావేశం లో పాల్గొంటారు అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు, అనంతరం ప్రెస్మీట్ ఉంటుందని ప్రతాప్ వెల్లడించారు.



