ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్, హోంగార్డు, మినిస్టీరియల్ స్టాఫ్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీకృష్ణప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించగా, స్కూల్ చైర్‌పర్సన్ శ్రీమతి నిష్ఠాశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే సిటీ ఆర్మడ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.



