Monday, 8 June 2026
  • Home  
  • క్యాన్సర్ బాధితుడికి అండగా అక్షరం తాళ్లపూడి యువ ప్రెస్ టీమ్
- తూర్పు గోదావరి

క్యాన్సర్ బాధితుడికి అండగా అక్షరం తాళ్లపూడి యువ ప్రెస్ టీమ్

తాళ్లపూడి, జూన్ 8 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి గ్రామానికి చెందిన పోతుల బాపిరాజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న అక్షరం తాళ్లపూడి యువ ప్రెస్ టీం మానవత్వంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. పేదరికంలో జీవనం సాగిస్తున్న బాపిరాజు కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న యువ ప్రెస్ సభ్యులు, తమ స్నేహితులు మరియు దాతల సహకారంతో కుటుంబాన్ని పరామర్శించి రూ.15,000 నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన జర్నలిజం అని యువ ప్రెస్ టీం సభ్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న పోతుల బాపిరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మరింత మంది దాతలు మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ సహాయ కార్యక్రమానికి స్పందించి ఆర్థిక చేయూత అందించిన మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు, దాతలందరికీ అక్షరం కోటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. సహాయం అందించిన వారిలో తాడిపూడి సొసైటీ అధ్యక్షుడు నామా వెంకటసుబ్బారావు (కొండబాబు) రూ.2,000, పుప్పాల వెంకటరావు రూ.2,000, కొటారు షమ్మీ రూ.2,000, పినిశెట్టి పవన్ రూ.1,000, అక్కాబత్తుల కరుణాకర్ రూ.1,000, మారం కృష్ణప్రసాద్ (కెపీ) రూ.500, నూతంగి రామకృష్ణ రూ.500, కడలి కిరణ్ రూ.500, సొలస ఉమ రూ.1,000, షేక్ షరీఫ్ రూ.1,000, ముసునూరి చందు రూ.1,000, బీజేపీ మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ రూ.1,000, అక్షరం కోటేశ్వరరావు రూ.1,500 అందించారు. “మా చిన్న సహాయం మరింత మంది దాతల్లో స్ఫూర్తి నింపి, బాపిరాజు కుటుంబానికి పెద్ద అండగా మారాలని కోరుకుంటున్నాం” అని యువ ప్రెస్ టీం సభ్యులు పేర్కొన్నారు

తాళ్లపూడి, జూన్ 8 (పున్నమి ప్రతినిధి):
తాళ్లపూడి గ్రామానికి చెందిన పోతుల బాపిరాజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న అక్షరం తాళ్లపూడి యువ ప్రెస్ టీం మానవత్వంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది.
పేదరికంలో జీవనం సాగిస్తున్న బాపిరాజు కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న యువ ప్రెస్ సభ్యులు, తమ స్నేహితులు మరియు దాతల సహకారంతో కుటుంబాన్ని పరామర్శించి రూ.15,000 నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన జర్నలిజం అని యువ ప్రెస్ టీం సభ్యులు పేర్కొన్నారు.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న పోతుల బాపిరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మరింత మంది దాతలు మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.
ఈ సహాయ కార్యక్రమానికి స్పందించి ఆర్థిక చేయూత అందించిన మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు, దాతలందరికీ అక్షరం కోటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
సహాయం అందించిన వారిలో తాడిపూడి సొసైటీ అధ్యక్షుడు నామా వెంకటసుబ్బారావు (కొండబాబు) రూ.2,000, పుప్పాల వెంకటరావు రూ.2,000, కొటారు షమ్మీ రూ.2,000, పినిశెట్టి పవన్ రూ.1,000, అక్కాబత్తుల కరుణాకర్ రూ.1,000, మారం కృష్ణప్రసాద్ (కెపీ) రూ.500, నూతంగి రామకృష్ణ రూ.500, కడలి కిరణ్ రూ.500, సొలస ఉమ రూ.1,000, షేక్ షరీఫ్ రూ.1,000, ముసునూరి చందు రూ.1,000, బీజేపీ మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ రూ.1,000, అక్షరం కోటేశ్వరరావు రూ.1,500 అందించారు.
“మా చిన్న సహాయం మరింత మంది దాతల్లో స్ఫూర్తి నింపి, బాపిరాజు కుటుంబానికి పెద్ద అండగా మారాలని కోరుకుంటున్నాం” అని యువ ప్రెస్ టీం సభ్యులు పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.