నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన “పల్లె పండుగ 3.0” కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పనులను ప్రారంభించారు.గ్రామంలోని మెయిన్ రోడ్డు నుండి హైస్కూల్ వరకు, అలాగే చాకలి వీధిలోని అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు ఆయన శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసి రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొత్తపల్లిలో రూ.3.0 పల్లె పండుగ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి
నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన “పల్లె పండుగ 3.0” కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పనులను ప్రారంభించారు.గ్రామంలోని మెయిన్ రోడ్డు నుండి హైస్కూల్ వరకు, అలాగే చాకలి వీధిలోని అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు ఆయన శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసి రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

