Monday, 17 August 2026
  • Home  
  • కొంగరకలన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- రంగారెడ్డి

కొంగరకలన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొంగరకలన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని కొంగరకలన్ డివిజన్‌లో గల పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 500 నుంచి 560 మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను ఘనంగా సత్కరించారు. 560 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కాకి రవీందర్ ముదిరాజ్ ఒక్కొక్కరికి రూ.(4,000,) 500 మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి 560 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున నగదు బహుమతి, శాలువాతో సత్కరించారు. రిటైర్డ్ టీచర్ లక్కరాజు రవీందర్ విద్యార్థులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత రెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు శిగ వీరస్వామి గౌడ్, ముద్దం శంకర్ గౌడ్, అండేకర్ శివాజీ, రిటైర్డ్ టీచర్ శ్రీనివాస్, బీఎస్పీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి బంగరిగళ్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ యువకులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

కొంగరకలన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని కొంగరకలన్ డివిజన్‌లో గల పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పదో తరగతిలో 500 నుంచి 560 మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను ఘనంగా సత్కరించారు. 560 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కాకి రవీందర్ ముదిరాజ్ ఒక్కొక్కరికి రూ.(4,000,) 500 మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందించారు.

రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి 560 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున నగదు బహుమతి, శాలువాతో సత్కరించారు. రిటైర్డ్ టీచర్ లక్కరాజు రవీందర్ విద్యార్థులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందించారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత రెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు శిగ వీరస్వామి గౌడ్, ముద్దం శంకర్ గౌడ్, అండేకర్ శివాజీ, రిటైర్డ్ టీచర్ శ్రీనివాస్, బీఎస్పీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి బంగరిగళ్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ యువకులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.