కేరళ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జూన్ 15 నుంచి అమలు చేయనుంది. తొలి 100 రోజుల పాటు ఈ పథకం సాధారణ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రయాణికుల స్పందన, ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి ఇతర బస్సు సర్వీసులకు కూడా విస్తరించే అంశాన్ని పరిశీలించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకం మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకం వల్ల రవాణా సంస్థపై గణనీయమైన ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం